ప్రభువా నే నిన్ను నమ్మి Telugu Christian Songs Lyrics

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా||

గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ
ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు (2) ||ప్రభువా||

నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికియున్నా
నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా||

ప్రభువా నే నిన్ను నమ్మి Jesus Songs Lyrics in Telugu


ప్రభువా నే నిన్ను నమ్మి Telugu Christian Songs Lyrics