రాజ్యాలనేలే మహారాజు Telugu Christian Songs Lyrics

రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని (2)
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ||

తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ||

రాజ్యాలనేలే మహారాజు Jesus Songs Lyrics in Telugu


రాజ్యాలనేలే మహారాజు Telugu Christian Songs Lyrics