Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సాగేను నా జీవ నావ Telugu Christian Songs Lyrics

సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ…. ||సాగేను||

నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ…. ||సాగేను||

తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ…. ||సాగేను||

ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ…. ||సాగేను||

సాగేను నా జీవ నావ Jesus Songs Lyrics in Telugu


సాగేను నా జీవ నావ Telugu Christian Songs Lyrics