Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సహోదరులారా Telugu Christian Songs Lyrics

సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు (2)

సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా||

దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా||

సహోదరులారా Jesus Songs Lyrics in Telugu