సహోదరులు ఐక్యత కలిగి Telugu Christian Songs Lyrics

అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు||

సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు||

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||

సహోదరులు ఐక్యత కలిగి Jesus Songs Lyrics in Telugu


సహోదరులు ఐక్యత కలిగి Telugu Christian Songs Lyrics