సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2)
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2)
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా ||సాగి||
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2)
ఇమ్మానుయేలు నీకు తోడుండగా(2)
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా ||సాగి||
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు (2)
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2)
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు ||సాగి||
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2)
విలువైన ఆత్మతో బలము నొందుము (2)
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు ||సాగి||