సమీపించరాని తేజస్సులో నీవు Telugu Christian Songs Lyrics

సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||

ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా||

మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||

సమీపించరాని తేజస్సులో నీవు Jesus Songs Lyrics in Telugu


సమీపించరాని తేజస్సులో నీవు Telugu Christian Songs Lyrics