సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
వసీయించువాడ నా దైవమా (2)
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా (2)
పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని||
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2)
దూషకుడను హానికరుడైన నన్ను (2)
కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని||
నా దేవా… నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2)
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2)
నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని||