సుమధుర స్వరముల గానాలతో Telugu Christian Songs Lyrics

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||

ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

సుమధుర స్వరముల గానాలతో Jesus Songs Lyrics in Telugu


సుమధుర స్వరముల గానాలతో Telugu Christian Songs Lyrics