ముళ్ళ కిరీటము Telugu Christian Songs Lyrics

ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు
చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
దిగిన మేకులు వేదన కేకలు
ఎంత గొప్పది యేసు నీ హృదయము
మా కోసమే ఇన్ని బాధలా
ఇంత ప్రేమ ఏలనో

సన్నుతింతుము సత్యవంతుడా
నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో
యేసు నీ త్యాగము మరువలేనిది
మా జీవితాలకు విలువ నిచ్చినది

ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము
యేసు నీ కృప మాకు చాలును
నీ నీతియే మాకు సంపద
నిన్ను కీర్తించుట దీవెన

మా విమోచకా మా రక్షణాధారమా
అందుకోవయా మా స్తుతి అర్పణములు
వందనం ప్రభు వందనం నీకు
నీ ప్రాణదానముకై సదా వందనం

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము

ముళ్ళ కిరీటము Jesus Songs Lyrics in Telugu


ముళ్ళ కిరీటము Telugu Christian Songs Lyrics