Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విజయశీలుడా Telugu Christian Songs Lyrics

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా||

అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు –(2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా||

ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు– (2)
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా||

ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు –(2)
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||

విజయశీలుడా Jesus Songs Lyrics in Telugu


విజయశీలుడా Telugu Christian Songs Lyrics