యేసయ్య మాట జీవింపజేయు Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో
యేసయ్య నామం కోరికలన్ని తీర్చును
యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము
యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య||

వ్యభిచార స్త్రీ యొక్క పాపము
క్షమించె యేసు దేవుడు (2)
ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2)
ఇదే కదా యేసు ప్రేమ
క్షమించు ప్రతి పాపము (2)

విరిగి నలిగినా హృదయమా
యేసుపై వేయుము భారము (2)
నీ దుఃఖ దినములు సమాప్తము
యేసుని అడిగినచో (2)
ఇదే కదా యేసు ప్రేమ
కన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య||

యేసయ్య మాట జీవింపజేయు Jesus Songs Lyrics in Telugu


యేసయ్య మాట జీవింపజేయు Telugu Christian Songs Lyrics