యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2)
నీ సన్నిధిలో నిత్యము
నిన్నారాధించెద యేసయ్యా (2)
ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ||
ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2)
నను వెలుగుగా మార్చినది
నాకు జీవమునిచ్చినది (2)
నీ నామము.. నీ నామము ||ఆరాధనా||
పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2)
నను నీతిగా మార్చినది
నను ఆత్మతో నింపినది (2)
నీ నామము.. నీ నామము ||ఆరాధనా||