Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

యేసు గొరియ పిల్లను నేను – Yesu Goriya Pillanu Nenu Lyrics

Telugu Christian Songs Lyrics ·

Language
Telugu
Collection
Telugu Christian Songs Lyrics

యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||

నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||

నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

యేసు గొరియ పిల్లను నేను – song video