Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసయ్యా ప్రాణ నాథా Telugu Christian Songs Lyrics

యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా
సిలువలో ప్రాణం పెట్టినావయ్యా
రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా

మరణాంధకారములో పడియున్న వేళ
ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2)
కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2)
నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా||

మరణ పాశాలన్ని ఛేదించినావు
ప్రేమ పాశాలతో దీవించినావు (2)
నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2)
మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2) ||యేసయ్యా||

మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు
ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు (2)
నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు (2)
రానున్న రారాజు నీ వధువు నేను (2) ||యేసయ్యా||

యేసయ్యా ప్రాణ నాథా Jesus Songs Lyrics in Telugu