సర్వ సృష్టిలోని Telugu Christian Songs Lyrics

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ||

ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే||

నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే||

సర్వ సృష్టిలోని Jesus Songs Lyrics in Telugu


సర్వ సృష్టిలోని Telugu Christian Songs Lyrics