బేత్లెహేము పురములో Telugu Christian Songs Lyrics

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
రారాజు యేసు క్రీస్తుని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

నన్నాన నా.. నా.. నా న నా న నా (4)
తనన్న నన్నాన నా – (3) తనననా (2)

ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
పశువుల తొట్టెలోన నిదుర చేసెను
అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము ||

పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి ||బేత్లెహేము ||

దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము ||బేత్లెహేము ||

బేత్లెహేము పురములో Jesus Songs Lyrics in Telugu


బేత్లెహేము పురములో Telugu Christian Songs Lyrics