యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నాకనులు తెరిచి కనిపించయా (2)
ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము (2)
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను||
తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము (2)
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను||