ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక ||2|| ||ఇదే నా కోరిక||
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని ||2||
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని ||2|| ||ఇదే నా కోరిక||
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని ||2||
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని ||2|| ||ఇదే నా కోరిక||
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని ||2||
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని ||2|| ||ఇదే నా కోరిక||

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.