తెల్లారింది వేళ Telugu Christian Songs Lyrics

అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా ||తెల్లారింది||

తెల్లారింది వేళ Jesus Songs Lyrics in Telugu


తెల్లారింది వేళ Telugu Christian Songs Lyrics