జన్మించె జన్మించె Telugu Christian Songs Lyrics

జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా||

తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు (2)
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరూ వాడా||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము (2)
మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరూ వాడా||

జన్మించె జన్మించె Jesus Songs Lyrics in Telugu


జన్మించె జన్మించె Telugu Christian Songs Lyrics