Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

kannerelamma

కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పే
ఏసే తోడమ్మా

1. నీకేమి లేదని ఏమి తేలేదని
అన్నారా నిన్ను అవమానపరిచారా
తల రాత ఇంతేనని తరువాత ఏమవునని
రేపటిని చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారను మధురముగా మార్చెను చూసావా

2. నీకెవరు లేరని ఏంచేయలేవని
అన్నారా నిన్ను నిరాషాపరిచారా
పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా

నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా