Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

krotha yedu modalu

New krotha yedu modalu christian song lyrics in telugu

Kotha yedu modalu pettenu song lyrics
క్రొత్త యెడు మొదలు బెట్టెను – మన బ్రతుకు నందు – క్రొత్త యెడు
మొదలు బెట్టెను – క్రొత్త మనసుతోడ మీరు – క్రొత్త యేట ప్రభుని సేవ
దత్తరపడకుండజేయు – టుత్తమోత్తమంబు జూడ

1.పొంది యున్న మేలులన్నియు – బొంకంబుమీఱ – డెందమందు
స్మరణజేయుచు యిందు మీరు మొదలుబెట్టు – పందెమందు
బారవలయు నందముగను రవిని బోలి – నలయకుండ సొలయకుండ …క్రొత్త…

2.మేలు చేయదడవొనర్చగా – మీరెఱగునట్లు కాలమంత నిరుడు
గడచెగా – ప్రాలుమాలి యుండకుండ – జాలమేల సేయవలయు
జాల జనము కిమ్మాను – యేలు నామ ఘనత కొరకు…క్రొత్త…

3.బలములేని వారమయ్యును – బలమొందవచ్చు – గలిమి మీఱ గర్త
వాక్కున – నలయకుండ నడగుచుండ – నలగకుండ మోదమొంది
బలమొసంగు సర్వవిధుల – నెలవి మీరనర్చుచుండ…క్రొత్త…

4.ఇద్దరిత్రి నుండునప్పుడే – ఈశ్వరుని జనులు – వృద్ధి బొంద జూడ
వలయును – బుద్ధి నీతిశుద్ధులందు – వృద్ధినొంద శ్రద్ధజేయు – శుద్దులైన
వారిలొ – బ్ర – సిద్దులగుచు వెలుగవచ్చు…క్రొత్త…

5.పాప పంక మంటినప్పుడు – ప్రభు క్రీస్తుయేసు – ప్రాపు జేరి మీరు
వేడగా – నేపు మీఱదనదు కరుణ – బాపమంత గడిగివేసి
పాప రోగ చిహ్నాలన్ని – బాపివేసి శుద్ధిచేయు…క్రొత్త..

క్రొత్త యెడు మొదలు బెట్టెను – మన బ్రతుకు నందు Christian Song in Telugu


Source from: https://www.youtube.com/watch?v=N-LiotZnncM