maatlaadu naa prabuvaa

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2)

సమరయ స్త్రీతో మాటాడావు
సకల పాపములు హరియించావు (2)
జీవ జలములు త్రావనిచ్చావు (2)
జీవితమునే మార్చివేసావు (2)

చచ్చిన లాజరును చక్కగ పిలిచావు
బయటకు రమ్మని ఆదేశించావు (2)
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు(2)
మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)