మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)
హృదయాంత రంగములో బాధలు తెలుసు
మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)
జగత్తు పునాది వేయబడక ముందే
మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో||
మనసులోని మాట నీవు పలుకకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
తల్లి గర్భమునందు నిను రూపించకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)
సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
ఆకాశ వీధులలో నీవు విహరించినా (2)
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||
నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు
నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2)
నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి
నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2)
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||