సకలము చేయు Telugu Christian Songs Lyrics

సకలము చేయు సర్వాధికారి
సర్వ జగతికి ఆధారుడా
నా హృదిలో వసియింప వచ్చినవాడా (2)
ఆరాధ్యుడా నా యేసయ్యా
ఆరాధన నీకే (2) ||సకలము||

జగద్రక్షకుడా విశ్వవిదాత
సర్వ కృపలకు దాతవు నీవే (2)
బలియైతివా మా రక్షణకై
సర్వ ఘనతలు నీకే ప్రభువా (2)
సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము||

బల శౌర్యము గల యుద్ధ శూరుడవు
సైన్యములకు అధిపతి నీవే (2)
నా జయములన్ని నీవే ప్రభువా
నా ఘనతలన్ని నీకే ప్రభువా (2)
నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము||

కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న
మహిమ గలిగిన రారాజువు నీవే (2)
చీకటి ఎరుగని రాజ్యము నీది
అంతమే లేదు నీ మహిమకు (2)
అంతమే లేదు నీ మహిమకు ||సకలము||

సకలము చేయు Jesus Songs Lyrics in Telugu


సకలము చేయు Telugu Christian Songs Lyrics