లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు (2)
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ||
నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి (2)
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ||
నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ||