మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసి నిన్ను
సంతోషగానాలను ఆలాపిస్తా – 3
1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు
ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు
పరమ తండ్రి నీవే గోప్పదేవుడవు
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు
2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు
సాతాన్ని ఓడించిన విజయ శీలుడవు
మరణము గెలచి తిరిగి లేచావు
నీవే మార్గము సత్యము జీవము