నా బలము నన్ను విడిచిపోయినా
నీ కృపయే నన్ను లేవనేత్తెను
హల్లెలూయ పాటలు పాడెదను
దినమంతా నిన్నే కీర్తించేదను
1. భూమి మార్పు నొందినను నడి సంద్రములో
పర్వతములు మునిగినను
నాకు ఏహాని కలుగకుండా
నీ కృప నాతో వున్నది దేవా
2. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై
వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా
నాకు ఏ హాని కలుగకుండా
నీ కృప నాలో వున్నది దేవా
3. సమస్తమును జయించిన దేవుడవు నీవు
నీ కృప నను విడువదంటివే
నాకు ఏహాని కలుగకుండా
నీ కృప నాతో వున్నది దేవా