nannu kavaga vachina najariya

నన్ను కావగ వచ్చిన నజరేయ యేసయ్యా
నేను పాపము చేసినా చూపావు నీ దయ
నన్ను ఎన్నడు విడిచి పోకుమయ్యా ఓ. ఓ.
సిలువ నీడలో నన్ను దాచుమయా
లోకమంతా నన్ను దోషిగా చూసినా ఆ. ఆ..
ప్రేమతోనే నన్ను చేరదీసినావు

నిన్ను విడచి దూరమైన ధూళిని నే యేసయ్య
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాధచేసి పోయినా ఆ… ఆ..
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా.

నీ చరణములే చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా ఆ. ఆ.
నీ వారసునిగా నన్ను ఎంచినా
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా.