Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Nee Bahu Balamu Ennadaina Lyrics

Nee bahubalamu song lyrics

నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా
నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ

ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి
అవమానించినవారే అభిమానమును పంచగా
ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం

సారవంతమైన తోటలో నను నాటితివి
సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును

వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు
శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు

గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును


Nee Bahu Balamu Ennadaina Lyrics