Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nindu manasutho ninne aaradhinchuta

నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం
మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట

నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు
అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య

నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి
నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య

సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా
వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా

నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య