oohinchaleni melulatho nimpina

పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా …… నా యేసయ్యా నీకు నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్ ….. వివరించగలనా నీ మేలులన్ (2)

1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు…..
రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును…
మేలులతో నా హృదయం తృప్తిపరచినావు…..
రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును…
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా….
స్తుతియింతునూ నీ నామమునూ (2)

2. నా దీన స్థితినీ నీవు మార్చినావు …
నా జీవితానికీ విలువనిచ్చినావు …
నా దీన స్థితినీ నీవు మార్చినావు …
నా జీవితానికీ విలువనిచ్చినావు …
నీ కృప తో నన్నూ ఆవరించినావు …
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)