Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సందేహమేల Telugu Christian Songs Lyrics

సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||

ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||

ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||

సందేహమేల Jesus Songs Lyrics in Telugu


సందేహమేల Telugu Christian Songs Lyrics