O Manava nee papam manava song

Manava nee papam manava video song

Manava nee papam manava song lyrics

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీబ్రతుకు మార్చవా 2″
పాపములోనే బ్రతుకుచున్నచో
చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో
తప్పదు నరకము. “2 ” ఓ మానవా ”

ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి
విడుదల పొందుము
యేసయ్యే తన రక్తంతో
నీపాపం కడుగును “2” “ఓ మానవా ”

ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి
పరమున చేర్చును ” 2 ” “ఓ మానవా ”
భాగస్వామ్యం చేయి