సృష్టికర్తవైన యెహోవా Telugu Christian Songs Lyrics

సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||

ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||

నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||

సృష్టికర్తవైన యెహోవా Jesus Songs Lyrics in Telugu


సృష్టికర్తవైన యెహోవా Telugu Christian Songs Lyrics