Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Nee vakyame nannu brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||

జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||

పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||


Nee vakyame nannu brathikinchenu