Top Best Popular Telugu Worship Lyrics of Christian Songs
If you love Christian songs, think of us. We at CM Portal have the best database of Christian songs, gospels, daily bible verses, Jesus songs and many more. We provide you the best of songs with all the latest and updated versions of tracks. We are considered to be the best source of Christian songs and Jesus songs.
It is popularly said “The music of Gospel leads us home”. To spread the word better and serve as a helping hand to the Evangelist, we have all the Christian song lyrics which helps one connect better with its songs. We have all the top Christian songs in all the different languages keeping in mind the secularism of the world around specially the country India.
There are Telugu Christian songs with Telugu lyrics, lyrics to Christian songs of worship, we also have old Christian song lyrics to help you better understand and connection makes easy. The different tracks and chords which make anybody mesmerize by amazing music and when this happens in your language i.e. Telugu then what more can you ask for so we have israyelu cheyu lyrics, preminchedan adhikamuga telugu songs lyrics, yesanna songs, dgs dhinchak songs, Paul thangiah songs lyrics, israyelu cheyu songs lyrics, Telugu praise and worship song’s lyrics.
To have an access to all this it is just a click away, believe it or not you get all the most worshipped songs and latest songs different collection in one page with different categorization and you can even customize according to your need. You can download Christian song’s lyrics in easy different formats according to your convenience like the popularly used one in the pdf forms like the Christian chords in pdf and songs also you can download for free i.e. free Christian songs mp3 download.
“Where words fail, music speaks”, they are considered to be one of the best therapies for any individual. Choose from varied range and different categories of songs to have the best of experience with your favorite songs. Christian song’s lyrics, Christian Hymns , devotional books i.e. gospel books in Telugu and English and worship Gospel songs and lyrics , all this you can access for free of cost at CM Portal’s page for zero cost and can also get a DVD free on all these. Why wait grab your one right away and enjoy the music to the fullest.
We keep you updated with all the latest and most praised songs and help you set your own playlist where in we give you open choice of customization which makes things conducive for oneself and don’t let you miss on your precious time. So gear up, now it’s your time to click in to CM Portal and have beautiful experience of both audio and visual treats as well that too at zero cost. Stay tuned for all the Christian songs and Gospels of learning and happy listening users.
Christian Music Song Lyrics Hymns Devotional Book In Telugu & English Praise And Worship Gospel Songs And Lyrics Free Dvd With Lyrics Listen Online Jesus Song’s Lyrics Watch On Cmporta.In
Top Christian Song Lyrics Book Online Best Jesus Music Hit Top Praise And Worship Telugu Christian Lyrics Latest New Popular Songs List Of Christian Lyrics
- Lyrics of Andhra Christian Keerthanalu songs book free download PDF పాటలు (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు)
- chris tomlin christian Jesus songs lyrics and Chords online download pdf books
- Top Best popular Famous Christmas Carols Song Lyrics and music hymns for kids telugu christian lyrics
- christian worship songs with Hillsong Lyrics hosanna free music online videos with lyrics
- New Telugu christian Songs 2016 prayer Lyrics and chords in powerpoint bookd pdf online yesanna jesus songs in telugu lyrics list
- Telugu christian music sheet worship video songs with lyrics free download offline christian songs with lyrics powerful worship songs download
- english devotional praise and worship songs lyrics pdf free download online
- Telugu Christian Jesus Hymns in Telugu and English songs lyrics books pdf download free
- telugu christian songs lyrics and chords in english script powerpoint list free download free
- Lyrics of Telugu Christian jesus worship Songs books pdf on line telugu christmas songs lyrics pdf
Top old christian devotional gospel worship song lyrics telugu: అందాల తార
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..
విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..
ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
Top old christian devotional gospel worship song lyrics telugu: అపరాధిని యేసయ్య
పల్లవి: అపరాధిని యేసయ్య – క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో – నపరాధములను క్షమించు ..అపరాధిని..
సిలువకు నినునే గొట్టితీ – తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని – దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
ప్రక్కలో బల్లెపుపోటు – గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని – మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..
ముళ్ళతో కిరీటంబు – నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె – చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..
దాహంబు గొనగా చేదు – చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ – దేహంబు గాయంబులను ..అపరాధిని..
ఘోరంబుగా దూరితిని – నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని – ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..
Top old christian devotional gospel worship song lyrics telugu: ఆడెదన్ పాడెదన్
పల్లవి: ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో
పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
Top old christian devotional gospel worship song lyrics telugu: అత్యున్నత సింహాసనముపై
పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే
ఆహాహా … హల్లేలూయ (4X)
ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా…
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా…
ఆమేన్ అనువాడా స్తోత్రం – ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా – అత్యున్నతుడా స్తోత్రం …ఆహాహా…
మ్రుత్యుంజయుడా స్తోత్రం – మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న – మేఘవాహనుడా స్తోత్రం …ఆహాహా…
Top old christian devotional gospel worship song lyrics telugu: అన్ని నామముల కన్న
పల్లవి: అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
పాపముల నుండి విడిపించును _ యేసునినామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గలయేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
Top old christian devotional gospel worship song lyrics telugu: ఆరాధించెదను
పల్లవి: ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో – ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో (2X)
నీ జీవవాక్యము నాలో – జీవము కలిగించే (2X)
జీవిత కాలమంత, నా యేసయ్య – నిన్నే కొలిచెదను (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో (2X)
చింతలెన్ని కలిగినను – నిందలన్ని నన్ను చుట్టినా (2X)
సంతోషముగ నేను, నా యేసయ్య – నిన్నే వెంబడింతును (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో – ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో (2X)
Top old christian devotional gospel worship song lyrics telugu: ఆలయంలో ప్రవేశించండి
పల్లవి: ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా ..ఆలయంలో..
ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా ..ఆలయంలో..
Top old christian devotional gospel worship song lyrics telugu: ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె
…ఆశ్చర్యమైన ప్రేమ…
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే
…ఆశ్చర్యమైన ప్రేమ…
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు
…ఆశ్చర్యమైన ప్రేమ…
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే
…ఆశ్చర్యమైన ప్రేమ…
Top old christian devotional gospel worship song lyrics telugu: ఆహామహానందమే
పల్లవి: ఆహా మహానందమే – ఇహ పరంబులన్
మహావతారుండౌ – మా యేసు జన్మ దినం – హల్లేలూయ .. ఆహా ..
కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు దూతలందరు (2X)
మాన్యులౌ పేద గొల్లలెందరో – అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2X)
నిన్నారాధించిరి – హల్లేలూయ .. ఆహా ..
యెహోవా తనయా – యేసు ప్రభూ, సహాయుడా – మా స్నేహితుడా (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ – మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము – హల్లేలూయ .. ఆహా ..
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ – స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X)
సర్వామికా సంఘంబు భక్తితో – సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో (2X)
నిన్నారాధింతుము – హల్లేలూయ
Top old christian devotional gospel worship song lyrics telugu: ఇది కోతకు సమయం
పల్లవి: ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా = పంటను కోయుదమా
కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే ..ఇది కోతకు..
సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా ..ఇది కోతకు..
శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా ..ఇది కోతకు..
Top old christian devotional gospel worship song lyrics telugu: ఉదయ కాంతి రేఖలో
పల్లవి: ఉదయ కాంతి రేఖలో – బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు – పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
పరమ పుత్రుని మోహన రూపుగని – తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు – ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు – ప్రస్తుతించిరి బాల యేసుని .. ఉదయ..
ఆకాశ తారల మెరుపు కాంతిలో – ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు – దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి – దూతలు పాడిరి జోల పాట .. ఉదయ.
Top old christian devotional gospel worship song lyrics telugu: ఉన్నతమైన ప్రేమ (Dm)
పల్లవి: ఉన్నతమైన ప్రేమ – అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ – పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా – ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా
నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2X)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2X)
ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా
… ఉన్నతమైన ప్రేమ …
నీదు ప్రేమ నాకు జీవం – నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2X)
నీవు కార్చిన రక్తమే నా – ముక్తి మార్గమై (2X)
ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా
… ఉన్నతమైన ప్రేమ …
Top old christian devotional gospel worship song lyrics telugu: ఉన్నతమైన స్థలములలో (Cm)
పల్లవి: ఉన్నతమైన స్థలములలో – ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా || ఉన్నత ||
చెదరి పోయినది మా దర్శనము – మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు – నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి – నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా – ఆత్మతో మము నిలుపుము దేవా || ఉన్నత ||
పరిశోధించుము మా హృదయములను – తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో – వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి – సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన – స్థిరపరచి బలపరచుము దేవా || ఉన్నత ||
మా జీవితములు నీ సన్నిధిలో – పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో – రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము – నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము – భారము తోడ ప్రకటించెదము || ఉన్నత ||
Top old christian devotional gospel worship song lyrics telugu: ఊహల కందని లోకములో (Fm)
పల్లవి: ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా (2X)
సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …
ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …
Top old christian devotional gospel worship song lyrics telugu: ఎందుకో నన్నింతగ నీవు
పల్లవి: ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నరరూపి వైనావు – నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే .. హల్లెలూయ..
నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు
నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ క్రుపలో .. హల్లెలూయ..
నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు – నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు .. హల్లెలూయ..
Top old christian devotional gospel worship song lyrics telugu: ఎన్ని తలచినా
పల్లవి: ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై – వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా – నా ప్రార్ధన ఆలకించుమా
నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే – నీ ప్రేమ పొందగా – అడవి పూవులే – నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా – ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము – ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో – ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా – లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు – ప్రభువా నీ నుండి వేరు చేయవు
ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
Top old christian devotional gospel worship song lyrics telugu: ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)
నీ జీవిత మూలమేదో – నీ బ్రతుకు ఆధారమేదో (2X)
… ఒకసారి…
1. తండ్రి యెహోవా తన్ను పోలి – నిను చేసెను తన వూపిరిలో (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ – జీవించమని కోరెను .
. ..నీ జీవిత…
దేవుని వదలి దుష్టుని కూడి – లోకము తట్టు మరలి (2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
…నీ జీవిత …
లోకము వీడు యేసయ్యన్ చూడు – నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
…నీ జీవిత …
Top old christian devotional gospel worship song lyrics telugu: ఓ నీతి సూర్యుడా
పల్లవి: ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని – నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
నేనే లోకానికి – వెలుగై యున్నానని
మీరు లోకానికి – వెలుగై యుండాలని
ఆదేశమిచ్చినావుగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
నా జీవితమునే – తూకంబు వేసిన
నీ నీతి త్రాసులో – సరితూగ బోనని
నే నెరిగియింటిగావున – నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
Top old christian devotional gospel worship song lyrics telugu: ఓ యేసు నీ దివ్య ప్రేమ
పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)
సిలువే శరణం ప్రతి జీవికివిలువే లేని మనుజాళికి (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము || ఓ యేసు||
తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య || ఓ యేసు||
Top old christian devotional gospel worship song lyrics telugu: ఓరన్న ఓరన్న
పల్లవి: ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)
చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా (2X)
అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును (2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)
పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా (2X)
పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను (2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)
లువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న (2X)
మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును (2X)
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)
Top old christian devotional gospel worship song lyrics telugu: కనుమా సిలువపై
పల్లవి: కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
Top old christian devotional gospel worship song lyrics telugu: కల్వరిగిరిలోన సిల్వలో
పల్లవి: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే (2X)
వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2X)
సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి
సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2X)
Top old christian devotional gospel worship song lyrics telugu: కలువరి గిరి సిలువలో
పల్లవి: కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2X)
విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2X)
యేసు దేవ నీదు త్యాగం – వివరింప తరమా (2X)
కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా
కరుణ లేని, కఠిన లోకం – కక్షతో సిలువేసిన (2X)
కరుణ చిందు మోము పైన – గేలితో ఉమ్మేసిన (2X)
ముల్లతోను, మకుటమల్లి – నీదు శిరమున నుంచిరా
నీదు శిరమున నుంచిరా
కలువరిగిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా
జాలి లేని పాప లోకం – కలువ లేదు చేసిన (2X)
మరణ మందు సిలువలోన – రుదిరమేనిను ముంచిరా (2X)
కలుష రహిత వ్యధను చెప్పి – అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా
కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2X)
విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2X)
యేసు దేవ నీదు త్యాగం వివరింప తరమా (2X)
కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా
Top old christian devotional gospel worship song lyrics telugu: క్రీస్తు జననము
పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు – ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు – నీ ప్రేమ నేర్పిటివి 2X
నీ వెలుగు ప్రకాశింప – నీ కరుణ ప్రకాశింప – నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..
సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2X
.. హల్లెలుయా..
Top old christian devotional gospel worship song lyrics telugu: క్రీస్తు నేడు లేచెను
క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ
మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుడుద్బ వింపగ ఆ ఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ
బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ద మైనవి ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్ల వారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ
మ్రుత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ
Top old christian devotional gospel worship song lyrics telugu: గగనము చీల్చుకొని
పల్లవి: గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో … గగనము…
మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో … గగనము…
కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు … గగనము…
Top old christian devotional gospel worship song lyrics telugu: గీతం గీతం జయ జయ గీతం
పల్లవి: గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా – దైవ సుతుని ముందు || గీతం||
వలదు వలదు యేడువవలదు – వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి || గీతం||
అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి || గీతం||
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ – బూరలెత్తి ధ్వనించుడి || గీతం||
Top old christian devotional gospel worship song lyrics telugu: గె త్సేమనే తోటలో
పల్లవి: గెత్సేమనే తోటలో – ప్రార్ధింప నేర్పితివా
ఆ ప్రార్దనే మాకునిలా – రక్షణను కలిగించెను
ఆ…ఆ…ఆ…ఆ… || గెత్సేమనే||
నీ చిత్తమైతే ఈ గిన్నెను – నా యెద్ద నుండి తొలగించుమని
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి || గెత్సేమనే||
ఆ ప్రార్దనే మాకు నిలా – నీ రక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం – నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే||
Top old christian devotional gospel worship song lyrics telugu: చిరకాల స్నేహితుడా
పల్లవి: చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా (2X)
నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
బంధువులు వెలివేసిన, వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
నిజమైనది, విడువనిధి, ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)
…చిరకాల స్నేహితుడా…
Top old christian devotional gospel worship song lyrics telugu: జయము క్రీస్తూ
పల్లవి: జయము క్రీస్తూ – జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ – జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
జయము క్రీస్తూ – జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి
సాతానుని జాడ – సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ || జయము ||
పాతాళము నొంచి – పరలోకము దెరచి
పాతాళము నొంచి – పరలోకము దెరచి
పాపాత్ముల కెంత – భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా స్తుతియించి || జయము ||
Top old christian devotional gospel worship song lyrics telugu: జయహే జయహే
పల్లవి: జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే జయహే
సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను – సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను – శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను – స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే జయహే
Top old christian devotional gospel worship song lyrics telugu: జీవనదిని నా హృదయములో ప్రవహింప
పల్లవి: జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2X)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2X)
2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2X)
3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2X)
4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2X)
Top old christian devotional gospel worship song lyrics telugu: తర తరాలలో
పల్లవి: తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో
దేవుడు …దేవుడు …యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..
భూమిని పుట్టింపక మునుపు – లోకము పునాది లేనపుడు .. దేవుడు…
2. సృష్టికి శిల్పాకారుడు – జగతికి ఆది సంభూతుడు .. దేవుడు…
3. తండ్రి కుమార ఆత్మయు – ఒకటై యున్నా రూపము .. దేవుడు…
Top old christian devotional gospel worship song lyrics telugu: దేవా నీకు స్తోత్రము
దేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినము
దేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినము
దీవించుము – నను ఈ దినము
దీవించుము – నను ఈదినము
జీవింతు నే నీకోసము
జీవింతు నే నీకోసము
ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్!
Top old christian devotional gospel worship song lyrics telugu: దేవుని వారసులం
పల్లవి: దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
దారుణ హింస లలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో – సర్వత్ర యేసుని కీర్తింతుము
పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై – సర్వాంగ హోమము జేయుదము
అనుదిన కూటములు – అందరి గృహములలో
ఆనందముతోను – ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో – ధ్యానము చేయుచు మరియుదము
Top old christian devotional gospel worship song lyrics telugu: దైవం ప్రేమ స్వరూపం
పల్లవి: దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే – అవనిలో
దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే
ఆ .. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం
ఆ …. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం … దైవం…
ఈ ధరలో ప్రేమ శూన్యం – ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూ న్యం – ఆదరణలేని గమ్యం
మధురంపు యేసు ప్రేమ – మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా – మదినింపు మధుర శాంతి … దైవం…
కరుణించి క్రీస్తు నీకై – మరణించే సిలువ బలియై
కరుణించి క్రీస్తు నీ కై – మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్ … దైవం…
Top old christian devotional gospel worship song lyrics telugu: నన్నెంతగానో ప్రేమించెను
పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు – నా పాపము – నా శాపము
తొలగించెను – నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో..
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2X)
పడనీయక – నన్ను చెడనీయక (2X)
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో..
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2X)
నేర్పించెను – నాకు చూపించెను (2X)
వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో..
కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2X)
నా కోసమే – తాను శ్రమ పొందెను (2X)
నా పాపమంతటిని క్షమియిం చెను (2X) .. నన్నెంతగానో..
ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2X)
ఏమిచ్చెదన్ – నేనేమిచ్చెదన్ (2X)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X) .. నన్నెంతగానో..
Top old christian devotional gospel worship song lyrics telugu: నా పేరే తెలియని ప్రజలు
పల్లవి: నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు (2X)
ఎవరైనా – మీలో ఎవరైనా – వెళతారా – నా ప్రేమను చెబుతారా (2X)
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2X) .. ఎవరైనా..
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2X) .. ఎవరైనా..
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2X) .. ఎవరైనా..
Top old christian devotional gospel worship song lyrics telugu: నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2X)
నే క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ (3X)
హల్లెలూయ హల్లెలూయ
శత్రు సమూహము నను చుట్టినా – లోకము నన్ను నిందించినా (2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము – నాకు తోడై జయ మిచ్చును (2X)
నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..
శోధన సంద్రము వలె పొంగినా – వ్యాధిబాధలు కృంగ దీసినా (2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X)
స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
ధన సంపదలు నను విడచినా – బంధు మిత్రులు నను మరచినా (2X)
యెహోవ రోఫీ నా కాపరి – నన్ను కాచి నడిపించును (2X)
నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2X)
క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ (3X)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ