Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విలువైనది నీ ఆయుష్కాలం Telugu Christian Songs Lyrics

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

విలువైనది నీ ఆయుష్కాలం Jesus Songs Lyrics in Telugu


విలువైనది నీ ఆయుష్కాలం Telugu Christian Songs Lyrics