ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ
నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ
నీరిక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని
పక్షి రాజు యవ్వనం వలె నూతన పరచుమా
అలయక సొలయక పరుగెత్తెద సేవలో
నీ కొరకై ఆశకలిగి నట్టివారు ధన్యులు
గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా
వెలుగు నిచ్చు జ్యోతినై యుండాలని
లోకానికి ఉప్పునై బ్రతకాలని
రోగులకే ఔషదం అవ్వాలని
జీవ జలపు నదిగా నేను ప్రవహించాలని
మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద
కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద
దిక్కులేని వారికి ఆదరణగ నుండెద
కడవరకు నీ ప్రేమ లోకమంత చాటెద