మా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకేనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకేనయ్యా
మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే.. నీవే యేసయ్యా (2)
మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్యా యేసయ్యా..
మా మనసులను స్వస్థపరచుము
యేసయ్యా యేసయ్యా.. నీవే ||మార్గము||
చీకటి లోయలో సంచరించినా
నిరీక్షణ కోల్పోయినా
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చెదవు (2) ||మార్గము||