Nadipinchu naa naava

నడిపించు నా నావ ! నడి సంద్రమున దేవా !! lyrics in Telugu

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

Nadipinchu Naa Naava lyrics in English

Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa
Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa ||Nadipinchu||

Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa
Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu ||Nadipinchu||

Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu
Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu
Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava ||Nadipinchu||

Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye – Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani – Allade Naa Valalu ||Nadipinchu||

Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata ||Nadipinchu||

Lothaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa
Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi
Lonunna Eevulalo – Lothaina Naa Brathuku
Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa ||Nadipinchu||

Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni
Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha
Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho
Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu ||Nadipinchu||

Ide naa hrudaya vanchana song

ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన !!2!!
నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా బ్రతుకు నీలో నే సాగని
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందనా…
నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని !!2!!
ఈలోక ఆశలన్ని విడవాలని ఈలోక ఆశలన్ని విడవాలని నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని !!2!!
యేసయ్య యేసయ్య నా ప్రాణం నీవయ్య నీ కన్నా ఈలోకాన నాకేవరున్నారయ !!2!!
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
ప్రతివారు నీ వైపు తిరగాలని ప్రతివారి మోకాలు వంగాలని !!2!!
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని !!2!!
ప్రతి ఆత్మ ప్రార్థనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని !!2!!
యేసయ్య యేసయ్య నా ప్రాణం నీవయ్య నీ కన్నా ఈలోకాన నాకేవరున్నారయ !!2!!
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని !!2!!
ప్రతి వారికి రక్షణ కావాలని !!2!!
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని !!2!!
యేసయ్య యేసయ్య నా ప్రాణం నీవయ్య నీ కన్నా ఈలోకాన నాకేవరున్నారయ !!2!!
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన
నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా బ్రతుకు నీలో నే సాగని
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన

a badha ledhu song

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా…
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా…
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…

పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…

brathakalani unna brataka lekunna song lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి
కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
నా ఆశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం
శోధనలా సుడివడిలో తొట్రిల్లేనే నా పయనం
చుక్కాని లేని నావనయితి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో ఏసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా……..
గురి చేర్చుమో ఏసయ్యా….నా గుండె గుడిలో నీవుండయ్యా……..
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా

Nee vakyame nannu brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||

జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||

పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||

Brathakalani unna brataka lekunna song

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి
కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
నా ఆశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం
శోధనలా సుడివడిలో తొట్రిల్లేనే నా పయనం
చుక్కాని లేని నావనయితి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో ఏసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా……..
గురి చేర్చుమో ఏసయ్యా….నా గుండె గుడిలో నీవుండయ్యా……..
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా

Naa kenno meelulu chesitive Christian telugu songs lyrics

Telugu Lyrics :

పల్లవి : నా కెన్నోమేలులు చేసితివే నీ కేమి చెల్లింతును
దేవ నీకేమి అర్పింతును – హల్లెలూయా యేసునాధా కృతజ్ఞతా స్తుతులివే

1. కృపచేత నన్ను రక్షించి నావే కృపవెంబడి కృపలో నను బలపరచితివే
నన్నెంతగానో ప్రెమించినావే నా పాపములు కడిగి పరిశుద్దపరచితివే ” నా ”

2. నా కిక ఆశలు లేవాను కొనగా – నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా కభయమిచ్చితివే ” నా ”

3. నీ కాడి మోపి నాతోడు నీవై నీ చేతి నీడలో నను దాచియున్నవే
ఏకీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను నడిపించు చున్నావే ” నా ”

4. నీ రాజ్యమందు నను చేర్చుకొన్నావు రానున్నవాడవు నారాజవు నీవు
నీ వధువు సంఘమును నను చేర్చుకొన్నావు నను కొన్న వాడవు నా వరుడవు నీవు ” నా ”

English Lyrics :

pallavi : naa kennoemealulu cheasitivea nee keami chellimtunu
deava neekeami arpimtunu – halleluuyaa yeasunaadhaa kRtaj~nataa stutulivea

1. kRpacheata nannu rakshimchi naavea kRpavembaDi kRpaloe nanu balaparachitivea
nannemtagaanoe premimchinaavea naa paapamulu kaDigi pariSuddaparachitivea ” naa ”

2. naa kika aaSalu leavaanu konagaa – naa aaSa neevaitivea aaSalu teerchitivea
naludiSala nannu bhayamaavarimpa naa pakshamamdumTivea naa kabhayamichchitivea ” naa ”

3. nee kaaDi moepi naatoeDu neevai nee cheati neeDaloe nanu daachiyunnavea
eakeeDu naaku raakumDa cheasi nee jaaDaloe nannu naDipimchu chunnaavea ” naa ”

4. nee raajyamamdu nanu chearchukonnaavu raanunnavaaDavu naaraajavu neevu
nee vadhuvu samGamunu nanu chearchukonnaavu nanu konna vaaDavu naa varuDavu neevu ” naa ”

yudhaa sthuthi gotrapu simhama

యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
అసాద్యమైనది ఏమున్నది

నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
అసాద్యమైనది ఏమున్నది

నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
అసాద్యమైనది ఏమున్నది

yesu premane chupiddam

యేసు ప్రేమనే చూపిద్దాం. యేసు లాగనే జీవిద్దాం
లోకాన్నే మార్చుద్దాం. చలో.
యేసు వార్తనే చాటేద్దాం నశించు ఆత్మను మార్చేద్దాం
యేసు సువార్తను ప్రకటిద్దాం. బోలో.
యేసయ్య సాక్షిగా జీవించుదాం తన చిత్తం నెరవేర్చుదాం (2)
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం.(2)

యేసయ్యనామం ముక్తికి మార్గం యేసయ్య సన్నిధి సంతోషం
యేసయ్య వాక్యం జీవాహారం యేసయ్యే మనకు ఆధారం

యేసయ్య చరణం పాపికి శరణం యేసయ్య చిత్తం చిరజీవం
యేసయ్యే మార్గం సత్యం జీవం యేసయ్య వలనే పరలోకం
యేసయ్య రాకకు సిద్ధపడుదాం ఆత్మలను సిద్ధపరచుదాం (2)
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం (2)

yudha raja simham thirigi leachenu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిన్‌ గెలిచి లేచెను

1. నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను – ఆవి వాడి పోయెను

2. దూత సైన్యమంత – స్తుతించు చుండ
స్తుతించు చుండ – యేసుని సన్నుతించుచుండ

3. మరణ సంకెళ్ళను – త్రెంచి వేసెను
త్రెంచి వేసెను – వాటిన్‌ వంచి వేసెను

4. యేసు లేచెనని – మ్రోగుచున్నది
మ్రోగుచున్నది – భయమున్‌ ద్రోలుచున్నది

5. వనితల్‌ దూత వార్త – విశ్వసించిరి
విశ్వసించిరి – మదిన్‌ సంతసించిరి

6.పునరుద్ధానుడెన్నడు – మరణించడు
మరణించడు – మరణించడెన్నడు

7. యేసూ! నీదు పాదం – మ్రొక్కెదము
మ్రొక్కెదము – మము ముద్రించుము

yesu raju rajula rajai

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే -2
త్వరగ వచ్చుచుండే -2

హోసన్నా జయమే -2
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే

1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
భయము లేదు జయము మనదే
విజయ గీతము పాడెదము

2. శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా -2
యేసు గాయముల్ స్వస్థపరచును -2
రక్తమే రక్షణ నిచ్చున్ -2

3. హల్లెలూయ స్తుతి మహిమ – ఎల్లప్పుడు
హల్లెలూయ స్తుతి మహిమ -2
యేసురాజు మనకు ప్రభువై – త్వరగా వచ్చుచుండె

yesayya nee bhavalu

యేసయ్యానీ భావాలు ఆ యెదలోనే నిండాలి
ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2)

కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి
కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి
నీ కరుణ మార్గములో నేను నడవాలి
నీ జీవజలములనే నేను సేవించాలి

నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి
నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి
రూపాంతరనుభవము నేను పొందాలి
నీ మహిమ రూపమునే నేను చూడాలి

yesu anu namame

యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

1. నా అడుగులు జార సిద్ధమాయెను -2
అంతలోన నా ప్రియుడు -2
నన్ను కౌగలించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

2. అగాధజలములలోన – అలమటించు వేళ -2
జాలి వీడి విడువక -2
నన్ను ఆదరించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

3. అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె -2
పురుషులలో నా ప్రియుడు -2
అధిక కాంక్షనీయుడు -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే….

yesayya ninnu chudalani

యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం

యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం

yennaluga

ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా
ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనా

యేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలని
యేసయ్య యేసయ్య నీకు పరవసించాలని

అవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలని
నీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని
నీతో గడపాలని

కన్నీరు తుడిచి కౌగిటిలో చేర్చి వేదన బాదలు నాకింకా లేవని
బంగారు వీదుల్లో కలిసి నడవాలని నిత్య జీవంలో నేను ఉండాలని
నిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని

నీతో గడపాలని

yenduko nannu

ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా

నీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను దేవా
హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా రాఫా
హల్లెలూయా యెహోవా షాలోం హల్లెలూయా యెహోవా షమ్మా

నాకు బదులుగా నాదు శిక్షను నీవు బరియించావు
పాతాల వేదన శ్రమల నుండి నన్ను విడిపించావు

నే క్రుంగి ఉన్న వేళలో నీవు కరుణించావు
నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందినావు

నీ బండ పైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు

పరలోక పరిచర్య బాగస్వామిగా నన్ను స్వీకరించావు

yehovanu sannutinchedam

యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నాకున్న స్వరము నన్ను విడచిననూ
నావారే నన్ను విడచి నింద లేసిననూ (2)
నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నాకున్న భయములే నన్ను కృంగదీయగా
నా హృదయం నాలోనే నలిగిపోయెగా (2)
నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నా ఆశలే నిరాశలై నిసృహలో వుండగా
నాపైన చీకటియే నన్నావరించెగా (2)
నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

yehovahye na balamu

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము
యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము
యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము

నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను
నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను

నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను
నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను
నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను
నా ముందుగా తానే నడచి నన్ను నడిపించెను

yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam

యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయని దేవా
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను
ఆదరెను ధరణి భయకంపముచే
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను
తన నోటనుండి వచ్చిన అగ్ని
దహించివేసెను వైరులనెల్లన్
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయమిచ్చును అపవాదికిని
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వమునణుచును
సర్వమునెరిగిన సర్వాధికారి
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే
అన్యజనులలో ధన్యత చూపుచు
హల్లెలూయ స్తుతిగానము చేసెద

yehova nannu karuninchuma

యెహెూవా. నను కరుణించుమూ
నా దేవా. నను దర్శించుమా
ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను
వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను

విచారము చేత నా కన్నులు గుంటలై
వేదనచేత నా మనస్సు మూగదై
నా హృదయమెంతో అలసిసొలసి వున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను

అవమానం చేత నా గుండెలు గాయమై
వంచనచేత నా ఊపిరి భారమై
నా హృదయమెంతో అలసిసొలసివున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను

yedabaayani deva

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు ప్రభువా
మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా

అ.ప: స్తుతులను చెల్లింతును – స్తోత్రములర్పింతును

1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా
నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా
నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా

2. నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము
నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము
గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా

yeasayya kanikarapurnuda

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము

1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి

నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)

సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి

శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే ” యేసయ్య ”

2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు

దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి

ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి

అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ” యేసయ్య ”

3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన

సీయెనులో వారు నిలిచెదరు

నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు

నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు ” యేసయ్య ”

ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..

ye patidho naa jeevitham

ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించినా నాకై మరణించినా
నన్ను విడిపించినా యేసుకే… (2)
ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం (2)

ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని (2)
పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని
పదిమంది ననుచూసి గేలి చేయువేళ. ఆ. ఆ..
పనికొచ్చే పాత్రగా నను చేసినా పరిశుద్ధునిగా నను మార్చినా
యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము (2)

అందచందాలు లేవని చదువు సంధ్యలే అబ్బని (2)
తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని
పదిమంది నను చూసి గేలి చేయువేళ. ఆ..ఆ..
పరిశుద్ధాత్మతో నను నింపినా సిలువ సాక్షిగా నను మార్చినా
యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము (2)

vunnavaadavu ani anuvaadavu

ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు

జక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్య
లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య
ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య.
నీలాంటి వాడు లేనే లేడయ్య

నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య
శత్రువును గెలిచిన బహు శూరుడవయ్య
సాతానును తొక్కిన జయశీలుడు నీవేనయ్య
మరణము గెలిచిన పునరుత్థానుడవయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీలాంటి వాడు లేనే లేడయ్య

verucheyajaluna

వేరు చేయజాలునా దూరపరచ జాలునా
నన్ను నిన్ను నిన్ను నన్ను
నిత్యము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని

శ్రమయైన గాని నిందయైన కాని
హింసయైన కాని కరువైనా కాని
నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా
నీ కృపనుండి నన్ను దూర పరచజాలునా
నిత్యము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని

రోగమైన గాని మరణమైన కాని
ఒంటరితనమే గాని ఓటమైన కాని
నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా
నీ కృపనుండి నన్ను దూరపరచ జాలునా
నిత్యముకొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని

velpulalo bahughanuda

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు !!2!!

నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు. . . .

!!వేల్పులలో!!

1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు !!2!!
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో !!2!!

!!వేల్పులలో!!

2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు !!2!!
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో !!2!!

!!వేల్పులలో!!

3. పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు !!2!!
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను !!2!!

!!వేల్పులలో!!

vandanamu neeke

వందనము నీకే – నా వందనము -1
వర్ణనకందని నికే – నా వందనము -2
వందనము నీకే – నా వందనము

1. నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా -2
దాని లోతు ఎత్తు నే గ్రహించి -2
నీ ప్రాణ త్యాగమునే -2

2. సర్వ కృపా నిధి నీవే – సర్వాధిపతియును నీవే -2
సంఘానికి శిరస్సు నీవే -2
నా సంగీత సాహిత్యము నీవే -2

3. మృతి వచ్చెనే ఒకని నుండి – కృప వచ్చెనే నీలో నుండి -2
కృషి లేక నీ కృప రక్షించెను -2
కృతజ్ఞతార్పణ లర్పింతును -2

vandanambonarthumo Prabho Prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా
వందనంబు లందుకో ప్రభో
ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో
ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా
దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా
కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా
మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము

unnathamaina rajyapu vasi

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా
ఆ మహిమను విడిచావా
ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా
ఈ ధరణికి వచ్చావా
నీ జన్మ మనుజాలిపంట – సాతనుకే చితిమంట
నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా

1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే
మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే
మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా
మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా
ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే
గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా
మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప
ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే
పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా
మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

thoorpu Diku Chukka Butte Merammaa O Mariyamma

తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు ||2||
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము