ఇంతలోనే కనబడి అంతలోనే
మాయమయ్యే అలపమైన దానికా ఆరాటం
త్రాసుమీద ధూళి వంటి ఎత్తలేని
నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏదీ కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు

1. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను భువినేలిన రాజులు
నాది నాది అంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా

2. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో