Skip to content
CM Portal క్రైస్తవ గీతాలు

కానెన్నడు నేను అనాథను – Kaanennadu Nenu Anaathanu Lyrics

Telugu Christian Songs Lyrics ·

Language
Telugu
Collection
Telugu Christian Songs Lyrics

కానెన్నడు నేను అనాథను
అయ్య కానెన్నడు నేను అనాథను (2)
(నా) కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||

అమ్మ నాన్న దూరమైనా
బంధువులే వెలివేసినా (2)
నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు||

వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనా (2)
నా కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు||

వ్యాధి బాధలవరించినా
రోగములతో కృంగదీసినా (2)
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||

కానెన్నడు నేను అనాథను – song video