నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్
నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్
నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ
నీ ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)

శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా
కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)

జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా
ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Jesus Songs Lyrics in Telugu


నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Telugu Christian Songs Lyrics