Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Kanureppa patina kanu muyaledu

కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ 2X
పగలు రేయి పలకరిస్తుంది పరమును విడచి నను వరియించింది 2X
కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||

1. ప్రేమ చేతిలో నను చెక్కు కున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది 2X
ప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని 2X ఎదురు చూస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

2. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచు చున్నది ప్రేమ లోగిలో బందించు చున్నది 2X
ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనె లేదని 2X కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||