నీ ప్రేమా….. నీ కరుణా… చాలునయా నా జీవితానా
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జాగానా
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్యమేలు నీ సన్నిధి మేలు
గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే
చేజారిన నాకై చేజాచినావే
చెదరిన నన్ను విడిపించినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే
నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే
నీప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే