నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు
నీ కొరకే దిగి వచ్చాడు నీ కోసం మరణించాడు
తన చేతులతో చేసెను తన ఊపిరిని పోసెను
తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెను
గాయములెన్నో నొందెను బహుదెబ్బలు పొందెను
నడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెను
నిన్ను విడచిపోగలడా నిన్ను మరచిపోగలడా
ప్రాణంగా ప్రేమించెగా తన ప్రాణాన్నే నీకిచ్చెగా
నీ కోసమే కల్వరిలో రక్తమంతా కార్చెగా
నిన్ను విడచిపోగలడా నన్ను మరచి పోగలడా
నా కొరకే దిగివచ్చెగదా నా కోసం మరణించెగదా
నన్ను విడిచిపోలేడు నన్ను మరిచిపోలేడు