Online Photoshop Course / ఆన్లైన్ ఫోటోషాప్ కోర్స్. Register Now

vandanambonarthumo Prabho Prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా
వందనంబు లందుకో ప్రభో
ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో
ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా
దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా
కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా
మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము