యేసయ్యానీ భావాలు ఆ యెదలోనే నిండాలి
ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి (2)

కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి
కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి
నీ కరుణ మార్గములో నేను నడవాలి
నీ జీవజలములనే నేను సేవించాలి

నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి
నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి
రూపాంతరనుభవము నేను పొందాలి
నీ మహిమ రూపమునే నేను చూడాలి